ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుంది
– మర్కుక్ మండలం బీజేపీ అధ్యక్షుడు సాయిరెడ్డి రాంరెడ్డి
గజ్వేల్ నియోజకవర్గం, 27 ఫిబ్రవరి 2025 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సాయి రెడ్డి రాంరెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పరిశీలించిన మర్కుక్ మండలం బీజేపీ అధ్యక్షుడు సాయిరెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ ప్రజలు బిజెపి వైపు ఉన్నారని భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ప్రజలు బిజెపిని కోరుకుంటున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని కచ్చితంగా బిజెపి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మర్కుక్ మండల మాజీ అధ్యక్షుడు రమేష్ గుప్తా, ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్, నాయకులు మోర్సు కిషోర్ రెడ్డి, బాబు, రాజు, తదితరులు పాల్గొన్నారు.