*పక్కా వ్యూహంతో ఎమ్మెల్సీని పట్టేసిన బీజేపీ*
TG: తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య భారీ విజయం నమోదు చేశారు. ఈ విజయం కోసం కమలం పార్టీ పక్కా వ్యూహం అమలు చేసింది. మిగతావారికంటే ముందుగా జనవరిలోనే అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థిగా మల్క కొమురయ్య బరిలోకి దింపింది. ఆయన విజయం కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహా ఇతర నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో విజయం దక్కింది.