బిజెపి కార్యకర్త సభ్యత్వం ప్రతిష్టాత్మక తీసుకోవాలి

* ప్రతి బిజెపి కార్యకర్త సభ్యత్వ నమోదు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి*

*బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలాదేవి*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 26*

బిజెపి కార్యకర్త ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలాదేవి కార్యకర్తలకు సూచించారు సోమవారం జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షుడు జీడి మల్లేష్ అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలదేవి మాట్లాడుతూ ప్రతి ఆరు సంవత్సరలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని సభ్యత్వ నమోదు చేయడం కార్యకర్త తన హక్కు భావించాలని తెలియజేశారు ఇప్పుడు సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఆరు సంవత్సరాల వరకు మళ్లీ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని కావున ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సభ్యత్వం చేయించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ ప్రతి పోలింగ్ బూత్ లో 200 పైచిలుకు సభ్యత్వాలు అయ్యే విధంగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పరిపాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు సీట్లు దానికి నిదర్శమని గుర్తు చేశారు 11 కోట్ల పైచిలుకు సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి ఉన్నదని గతంలో కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేయాలని కార్యకర్తలకు సంపత్ రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలాదేవి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ పల్లపు రవి ఠాగూర్ రాజేష్ కైలాస కోటి గణేష్ అప్పం మధు యాదవ్ మోతే స్వామి తూడి రవిచందర్ రెడ్డి కొమ్ము అశోక్ మోడం రాజు బల్సుకూరి రాజేష్ ఠాగూర్ రాకేష్ గిరవేణి విజేందర్ గండికోట సమ్మయ్య కొండ్లె నాగేష్ ఊడుగుల రవికుమార్ బూరుగుపల్లి రాము ఉడుగుల రవికుమార్ ఎండి హబీబ్ ఉడుగుల మహేందర్ పొనగంటి రవీందర్ ముకుందం సుధాకర్ బచ్చు శివకుమార్ అప్పాల రవీందర్ కొండపర్తి ప్రవీణ్ ఎర్ర వెంకటేష్ కన్నబోయిన బద్రి నాగపురి విజయ్ యాంసాని సమ్మయ్య తాళ్ల పెళ్లి తిరుపతి దార కృష్ణ కేశ స్వరూప కనుమల్ల లక్ష్మి శ్రీవర్తి అఖిల్ బిమానదుని రోషన్ సృజన- రామస్వామి సిరియాల విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now