కీసర కొత్త సీఐకి బీజేపీ యువనేత రాహుల్ రెడ్డి శుభాకాంక్షలు
పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కారం
మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం ఆగస్టు 2
కీసర పోలీస్ స్టేషన్‌కు ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అర్వపల్లి ఆంజనేయులును నాగారం పట్టణ బీజేపీ యువజన నాయకుడు కౌకుట్ల రాహుల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాహుల్ రెడ్డి, సీఐ ఆంజనేయులుకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించేందుకు ఈ రకమైన పరస్పర వినమ్రత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, సాయికుమార్, సాయికిరణ్, వామన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.