Site icon PRASHNA AYUDHAM

కీసర కొత్త సీఐకి బీజేపీ యువనేత రాహుల్ రెడ్డి శుభాకాంక్షలు

IMG 20250802 WA0080

కీసర కొత్త సీఐకి బీజేపీ యువనేత రాహుల్ రెడ్డి శుభాకాంక్షలు

పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కారం

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం ఆగస్టు 2

కీసర పోలీస్ స్టేషన్‌కు ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అర్వపల్లి ఆంజనేయులును నాగారం పట్టణ బీజేపీ యువజన నాయకుడు కౌకుట్ల రాహుల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాహుల్ రెడ్డి, సీఐ ఆంజనేయులుకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించేందుకు ఈ రకమైన పరస్పర వినమ్రత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, సాయికుమార్, సాయికిరణ్, వామన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version