జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల..

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల..

IMG 20240826 WA0045

జమ్మూకశ్మీర్‌ తొలి అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది. మొత్తం మూడు విడతలకు సంబంధించి 44 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో దశకు 19 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. కాగా, సెప్టెంబరు 18న తొలి విడత, 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Join WhatsApp

Join Now