ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్‌లో బీజేపీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం.
ప్రశ్న ఆయుధం మే18: కూకట్‌పల్లి ప్రతినిధి
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. స్థానిక డివిజన్ నాయకులు ఈటల రాజేందర్ కి ఘన స్వాగతం పలికారు, అనంతరం నూతన కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించరు , ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ –”ప్రజల సౌకర్యార్థం, ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజల కోసమే పోరాడే పార్టీ అని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఎంతో పురోగతి సాధించిందని రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడ ప్రజలు బిజెపి అవకాశం ఇస్తానని వారు తెలియజేశారు.
కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎస్.మల్లా రెడ్డి , కూకట్ పల్లీ అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు,అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు,జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యారు. కార్యాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించలని స్థానిక నాయకులకు వడ్డేపల్లి రాజేశ్వరరావు సూచించారు.