బీసీ సంఘాల బంద్ కు బిజెపి మద్దతు… బంద్ లో పాల్గొన్న కరీంనగర్ బిజెపి శ్రేణులు

బీసీ సంఘాల బంద్ కు బిజెపి మద్దతు… బంద్ లో పాల్గొన్న కరీంనగర్ బిజెపి శ్రేణులు

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్

బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు

కరీంనగర్ అక్టోబర్ 18 ప్రశ్న ఆయుధం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేపట్టిన బంద్ కార్యక్రమానికి బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈమేరకు కరీంనగర్ బిజెపి శ్రేణులు బంద్ కార్యక్రమంలో పాల్గొని బీజేపీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేని కాంగ్రెస్ తీరును నిరసిస్తూ నేటి బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా 42 శాతం రిజర్వేషన్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసిందన్నారు. దశాబ్ద కాలం దేశాన్ని రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ ఆనాడు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. నేడు రిజర్వేషన్ల అంశంతో బిజెపి పై బురద జల్లడానికి. పనికిమాలిన రాజకీయాలు చేస్తుందని ఆయన ఫైర్ అయ్యారు. బీసీలకు ప్రస్తుతం చట్టబద్ధంగా ఉన్న 27 శాతం ను 42 శాతం చేస్తామని ఆచరణ సాధ్యం కానీ , అమలుకు నోచుకోని హామీని కాంగ్రెస్ ఇచ్చి బీసీలను మభ్యపెట్టి మోసం చేసిందని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చే ఆలోచన కంటే , రాజకీయాలనే నమ్ముకుందని ఆ దిశలోనే ఓ వర్గానికి మేలు చేసి , బీసీలకు అన్యాయం చేసే విధంగా రిజర్వేషన్లపై రాజకీయ నాటకాలు మొదలుపెట్టిందని ఆయన మండిపడ్డారు. శాస్త్రీయత లేని కులగనన సర్వే చేపట్టి చేతులు దులుపుకొని, అసంబంద్ధమైన దస్త్రన్ని గవర్నర్ కు పంపి 42 రిజర్వేషన్ నుండి తప్పించికోవడానికి ప్రయత్నం చేసిందన్నారు. రాష్ట్రం లో హైకోర్టు, జాతీయ స్థాయిలో సుప్రీం కోర్టు లు సైతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ తప్పు పట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ది కపట నాటకమేనని ఆయన విమర్శించారు.

Join WhatsApp

Join Now