Site icon PRASHNA AYUDHAM

ఒంటరి లక్ష్మణ్‌కు బీజేపీ సహాయహస్తం

IMG 20250806 172631

ఒంటరి లక్ష్మణ్‌కు బీజేపీ సహాయహస్తం

ప్రశ్న ఆయుధం కరీంనగర్, ఆగస్టు 6

అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్న మహంతి లక్ష్మణ్‌కు బీజేపీ సహాయం

ఇటీవల మరణించిన లక్ష్మణ్ సతీమణికి శ్రద్ధాంజలి, కుటుంబానికి సానుభూతి

బీజేపీ తరఫున 25 కిలోల బియ్యం బస్తా అందజేత

ప్రభుత్వంతో ఇంటి స్థలం, పెన్షన్ కోసం చర్యలు కోరిన నేతలుపలువురు బీజేపీ నాయకులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి 19వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో నివసించే మహంతి లక్ష్మణ్ సతీమణి భవాని ఇటీవల పరమపదించారు. భార్య మరణంతో ఒంటరి అయిన లక్ష్మణ్‌కు బీజేపీ తరఫున నేతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. ఆయనకు 25 కిలోల బియ్యం బస్తాను అందించారు.

లక్ష్మణ్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారు వివాహితులు. ప్రస్తుతం అతను అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు సొంత ఇల్లు లేకపోవడంతో, ప్రభుత్వంవారి తరఫున ఇంటి స్థలం, పెన్షన్ మంజూరుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు న్యాయవాది దుర్గం మారుతి, పిట్టల సత్యనారాయణ, హస్తపురం అంజయ్య, తాటికొండ శంకర్, దేవోజు రవీందర్, కనకయ్య, మహిళా గ్రూపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భవాని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Exit mobile version