నేత్రదానంతో ఇద్దరి అంధులకు చూపు ప్రసాదించిన ధన్యజీవి బత్తిని సత్య
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని బాలుర హై స్కూల్ ప్రాంతానికి చెందిన బత్తిని సత్య(65) మృతిచెందగా యోగా మిత్రుడు రావికంటి రవీందర్, పబ్బు రవీందర్ లు మృతురాలి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించగా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో యోగా గురువు సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మచ్చగిరి నరహరి ఆధ్వర్యంలో వరంగల్ ఎల్విపి టెక్నీషియన్ రాజేంద్ర ప్రసాద్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్ వి పి ఐ బ్యాంక్ కు పంపించారు.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన ధన్యజీవి బత్తిని సత్య అని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు ఆన్నారు మృతురాలి కుమారులు, కోడళ్ళు, బత్తిని శివ, శిల్ప, బత్తిని వాసు ఆశ కూతుర్లు, అల్లుండ్లు పెరుమాండ్ల మాధవి కీర్తిశేషులు సత్యనారాయణ, ఆరెల్లి మంజు లక్ష్మణ్, పులి వాణి శ్రీదర్ లకు సహకరించిన రావికంటి రవీందర్ పబ్బు రవీందర్ డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు చిటికేసి శివానందయ్య బంధుమిత్రులకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి,ప్రచార కార్యదర్శి వాసు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి లగిశెట్టి చంద్రమౌళి బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.