మహిళా ఎంపీ ని అడ్డుకోవడం అప్రజాస్వామికం..

మహిళా ఎంపీ ని అడ్డుకోవడం అప్రజాస్వామికం..

-కలెక్టర్ ను కలవడానికి ఎంపీ డీకే అరుణ గారు వెళ్తే తప్పేంటి..

-సీఎం అన్న తిరుపతిరెడ్డి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా

-పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలి

-బిజెపి మహిళా మోర్చా మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి డిమాండ్

మహబూబ్నగర్, నవంబర్ 14:
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఘటనపై రైతులను కలిసేందుకు వెళుతున్న ఎంపీ డీకే అరుణ గారిని పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం అని బిజెపి మహిళా మోర్చా మహబూబ్నగర్ శాఖ జిల్లా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి అన్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఎంపీ గారిని అడ్డుకోవడాన్ని సాహితీ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో నాలుగు గ్రామాలు, రెండు తాండాలకు సంబంధించిన పొలాలను ఫార్మా కంపెనీ పేరుతో వందల ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఇదే విషయంపై రైతులకు అండగా నిలిచి వారి సమస్యలు తెలుసుకునేందుకు, కలెక్టర్ ను కలిసేందుకు వెళ్తున్న ఎంపీ అరుణమ్మ గారికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అవే సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి పర్యటనకు వెళ్తే

Join WhatsApp

Join Now