రక్తదానం చేసిన జర్నలిస్టు ఎల్లంరాజు

రక్తదానం చేసిన జర్నలిస్టు ఎల్లంరాజు

గజ్వేల్, 14 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో శుక్రవారం దత్త డయాగ్నస్టిక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్టు ఎల్లంరాజు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ మాట్లాడుతూ జర్నలిస్టుగా విశేష సేవలు అందిస్తూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేసిన ఎల్లంరాజు అభినందనీయుడని అలాగే, అత్యంత అరుదుగా ఉండే ప్రత్యేకమైన O నెగిటివ్ బ్లడ్ దానం చేసిన జర్నలిస్టు ఎల్లంరాజును అభినందించారు.

Join WhatsApp

Join Now