పోలీస్ ఫ్లాగ్‌ డే సందర్భంగా జాగృతి సభ్యుల రక్తదానం

🚩 పోలీస్ ఫ్లాగ్‌ డే సందర్భంగా జాగృతి సభ్యుల రక్తదానం

కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరం 

— ట్రాఫిక్ దాడులపై ఆటో యూనియన్ ప్రతినిధుల చర్చ 

— పాత చలాన్లకు 10 రోజుల గడువు ప్రకటించిన ఎస్పీ

 

కామారెడ్డి, జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 29

బుధవారం 

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జాగృతి వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, సలహాదారులు, ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొని రక్తదానం చేశారు.

తరువాత, ఆటోలపై జరుగుతున్న ట్రాఫిక్ దాడులను నిలిపివేయాలని, పాత చలాన్ల సమస్యల పరిష్కారం కోరుతూ జాగృతి ప్రతినిధులు ఎస్పీ కలుసుకున్నారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ , ట్రాఫిక్ ఎస్ఐ మహేష్, సంబంధిత అధికారులతో చర్చించి పాత చలాన్లు, యూనిఫామ్ వంటి అంశాలపై 10 రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మహేష్, కామారెడ్డి జిల్లా BC అధ్యక్షులు కుంట రవి, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు SK అల్తాఫ్, ప్రధాన కార్యదర్శి V. సురేందర్ రావ్, ఉపాధ్యక్షులు చెట్కూరి రవి, ఉగ్రవాయి సాయిలు, గడిమిది మహేందర్, కడరి రాజయ్య, కోశాధికారి J. చక్రదర్ రావ్, సలహాదారులు K. శ్యామయ్య, T. బాలు, బండమిది బాలరాజ్, రాము, సుద్దాల నవీన్, కృష్ణమూర్తి, కార్యదర్శి శివలింగం, రైటర్ కందుకూరి సంజీవ చారి తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో పాల్గొన్నవారిని పోలీసులు అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment