Site icon PRASHNA AYUDHAM

78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరం 

IMG 20240814 WA0432

78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరం 

*రక్తదానానికి యువత ముందుకు రావాలి… రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి*

*ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..*

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 14, కామారెడ్డి :

78వ భారత జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయాలని మంచి సంకల్పంతో ఆగస్టు 15వ తేదీన ప్రభుత్వ వైద్యశాలలోని రక్తనిధి కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఏ దేశానికి లేనటువంటి ప్రత్యేకత ఉన్నదని లక్షలాదిమంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఈ దేశానికి స్వతంత్రం రావడం జరిగిందని, ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలని రక్తదాతలు ప్రాణదాతలు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు.

రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను, కీ చైన్ లను అందించడం జరుగుతుందని తెలియజేశారు. రక్తదానం చేయాలనుకున్న వారు వారి యొక్క వివరాలను 9492874006, 8897349872 నెంబర్లకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్, ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్, ఉపాధ్యక్షులు జమీల్, డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, కిరణ్, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్, రమణ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version