ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం

ప్రశ్నాయుధం న్యూస్, ఆగస్టు 12, కామారెడ్డి :

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, జెర్సీ డైరీ అధినేత కీర్తిశేషులు చింతల బాలరాజ్ గౌడ్ 64 వ జన్మదినం పురస్కరించుకొని కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయకుమార్ తెలిపారు.
ఈ రక్తదాన శిబిరం మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్ & రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించగా ఎన్.సిసి & ఎన్ఎస్.ఎస్ విద్యార్థులు రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమానికి చింతల్ బాల్ రాజ్ గౌడ్ సతీమణి శ్రీమతి మంగా వారి కుమారులు చింతల నితిన్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. కిష్టయ్య ఎన్ సిసి అధికారి లెఫ్ట్ నెంట్ డాక్టర్ సుధాకర్ , అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ రాజ్ గంభీరావు, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, డాక్టర్ శ్రీనివాసరావు , రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి చైర్మన్ రాజన్న, నిజామాబాద్ చైర్మన్ ఆంజనేయులు , కోఆర్డినేటర్ పీవీ నరసింహారావు ,సెక్రెటరీ రఘుకుమార్ ప్రభుత్వ హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now