డ్రైనేజీలో వ్యక్తి మృతదేహం

నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 20:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాలకల్ రోడ్ లో కల్లు కాంపౌండ్ ఎదురుగా ఉన్న స్మశానవాటికను అనుకోని డ్రైనేజీలో ఈ రోజు అనగా బుదవారం ఉదయం ఒక వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పట్టణ ఐదవ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలన నిర్వహించారు.

20241120 112839.jpg

మృతుడు సీతారాం కాలనికి చెందిన కాంబ్లీ కపిల్ (35) గా గుర్తించారు. అతను దినసరి కూలి పనులతో జీవనం కొనసాగిస్తూ ఉంటాడని స్థానికులు తెలిపారు. మృతదేహం ఆ ప్రాంతంలో కనబడడంతో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై, ఎస్.ఐ. గంగాధర్ కేసు నమోదు చేసి మరింత విచారణ చేపట్టారు.

Join WhatsApp

Join Now