తిరుపతిలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపు
తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్‌కు ఈరోజు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో హోటల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు గురువారం కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరిం పులు రావడంతో కలకలం రేగింది. తాజాగా లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజకూడలిలోని మరో హోటల్‌కు ఈరోజు కూడ మెయిల్లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్త మయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.