*దిల్లీలో రెండు స్కూళ్లకు బాంబు బెదిరింపు*
*Jul 14 2025*
ఢిల్లీకి చెందిన ద్వారక, చాణక్యపురి ప్రాంతాల్లోని రెండు ప్రముఖ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. పోలీస్ బాంబు స్క్వాడ్‌లు అక్కడికి చేరుకుని సోదాలు నిర్వహించాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. కాగా, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.