మాచారెడ్డి జై గౌడ ఉద్యమం మండల అధ్యక్షునిగా బొంబోతుల సురేష్ గౌడ్
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి
(ప్రశ్న ఆయుధం) జులై 26
మాచారెడ్డి మండల జై గౌడ ఉద్యమం అధ్యక్షునిగా బొంబోతుల సురేష్ గౌడ్ ను నియమించారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సోమవారం జరిగిన సమావేశంలో, జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల మురళి గౌడ్ నియామక పత్రం అందజేశారు. గౌడ కులస్తుల సమస్యల సాధన కోసం కృషి చేయాలన్నారు. తనపై నమ్మకం ఉంచి మాచారెడ్డి జై గోడ ఉద్యమం మండల అధ్యక్షునిగా నియమించినందుకు జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు వట్టికూడి రామారావు గౌడ్,కి మరియు జిల్లా అధ్యక్షులు రంగోల్ల మురళి గౌడ్ ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్ లకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా నాయకులు ఇందూరి సిద్ధా గౌడ్, తాటిపాముల ప్రశాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.