జిమ్మిడి సడలమ్మ దశ దినకర్మలకు హాజరై సంతాపం తెలిపిన బొమ్మెర శ్రీనివాస్

ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి పినపాక మండల కమిటీ ఆధ్వర్యంలో జిమ్మిడి సడలమ్మ దశ దినకర్మ పినపాక మండలం మల్లారం గ్రామంలో సోమవారం సంతాప కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. సడలమ్మ లేని లోటు ఆ కుటుంబానికే కాదు ఉద్యమానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల హక్కుల కోసం తపించిన రాష్ట్ర కమిటీ మెంబర్ సడలమ్మ ఆశయాల కోసం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కండె రాములు, ఇనమల వెంకటేశ్వర్లు,పినపాక మండల కమిటీ కన్వీనర్ జాడి కిరణ్, బిల్లా రాధా, గౌరవ సలహాదారులు, వల్లపాక నాగేశ్వరరావు, జాడి లక్ష్మయ్య, జాడి రాంబాబు, గోమాస్ గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment