ఘనంగా బోనాల పండుగ
కామారెడ్డి 21 వ వార్డు లో బోనాల పండుగ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 20
కామారెడ్డి పట్టణంలోని, బీడీ వర్కర్స్ కాలనీ 21 వార్డ్ ప్రజలు పోచమ్మ దేవాలయంలో వనదేవతలకు ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లాపాపలు, పాడిపంటలు చల్లగా ఉండాలని ఈ వంటల ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. వనదేవతల పండగ, లేదా వనదేవతల జాతర అని కూడా పిలుస్తారు. ఈ పండగను సాధారణంగా ఆషాడ, శ్రావణ మాసాలలో జరుపుకుంటారు. ఈ ఆనవాయితీ పెద్దవాళ్ల నుంచి వస్తున్న ఆచారం అని తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఈ పండగను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.