Site icon PRASHNA AYUDHAM

వైభవంగా బోనాల ఉత్సవాలు 

IMG 20250720 WA2531

వైభవంగా బోనాల ఉత్సవాలు

కోలాహలంగా బోనాల జాతర ఊరేగింపులు

అమ్మ వార్ల దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

 ఎల్బీనగర్ జులై 20: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బోనాల పండుగను ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోగల హస్తినాపురం బి.యన్.రెడ్డి నగర్, వనస్థలిపురం డివిజన్లలో తదితర కాలనీలో నిర్వహించిన ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే అమ్మవారికి పూజలు బోనాలు సమర్పించారు. మహిళలు, వృద్ధులు, పిల్లలతో దేవాలయాలు కిటకిట లాడాయి. పోతురాజుల విన్యాసాలు, డబ్బుల చప్పట్లతో అమ్మ వార్లకు మొక్కులు తీర్చుకున్నారు. హయత్ నగర్ డివిజన్ పరిధిలోగల పలు కాలనీలలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్ళెం నవజీవన్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున, ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా అమ్మవార్ల పూజలో పాల్గొన్నారు. బి.యన్ రెడ్డి నగర్ డివిజన్లోని వివిధ కాలనీలో నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమానికి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, వనస్థలిపురం డివిజన్ పరిధిలో గల పలు కాలనీలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖసంతోషాలతోటి, ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని వివిధ ప్రజాప్రతినిధులు అమ్మవారిని వేడుకున్నారు. ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ఆలయ కమిటీల సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినందులకు భక్తులు అభినందించారు.

Exit mobile version