కూకట్పల్లి నియోజకవర్గం లో బోనాలు జాతర
మేడ్చల్
ప్రశ్న ఆయుధం
కూకట్పల్లి నియోజకవర్గం , బోనాల జాతర సందర్బంగా కూకట్పల్లి నియోజకవర్గం లోని పలు డివిజన్లో బోనాల ఉత్సవాలకు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు తో కలిసి పాల్గొన్న టి పి సి సి ఉపాధ్యక్షులు మరియు కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా బండి రమేష్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం లో బ్లాక్ అధ్యక్షులు, టెంపుల్ కమిటీ చైర్మన్ లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్, మహిళ నాయకురాలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.