Site icon PRASHNA AYUDHAM

బోనాలు తెలంగాణ సంస్కృతిక వైభవ ప్రతీకలు – సత్యం శ్రీరంగం. “

IMG 20250717 WA0554

” బోనాలు తెలంగాణ సంస్కృతిక వైభవ ప్రతీకలు – సత్యం శ్రీరంగం. “

ప్రశ్న ఆయుధం జులై17: కూకట్‌పల్లి ప్రతినిధి

” అమ్మవార్ల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. “
ఆషాడమాస బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని మూసాపేట్ లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ, పోచమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం కమిటీల ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా హాజరై అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, ఆలయ చైర్మన్ ఆర్కె ఎల్లేష్ యాదవ్. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ గ్రామా దేవతలకు బోనాలు సమర్పించడం దేశంలోనే మనదైన ప్రత్యేకత అని అన్నారు. బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందడం వందల ఏండ్ల నుండి వస్తున్న సంస్కృతిక సంప్రదాయ పరంపర భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని అన్నారు. అమ్మవారి చల్లని దీవెనలతో రాష్టంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరనన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్, గాజుల మహేష్ గౌడ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు జోజోమ్మ, ఐఎన్ టియూసి అధ్యక్షులు నరసింహ యాదవ్, తూము మనోజ్, తూము శైలేష్, రాము, టీంకు, తోట రాజు, సప్పిడి భాస్కర్, మల్లేష్ యాదవ్, సప్పిడి వినీత్, కర్రేమ్మ, సప్పిడి జగన్, వినోద్, సంతోష్, అఖిలేష్, శ్రీను, ఆలయకమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Exit mobile version