రైతుల దగ్గర లంచం తీసుకున్న బోనకల్ మండల సర్వేయర్
బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాదే శేషారెడ్డి అనే రైతు ఈరోజు బోనకల్ తాసిల్దార్ ఆఫీస్ నందు మండల సర్వేయర్ గారిని కలిసేందుకు వచ్చిన రైతు,ఈ క్రమంలో సర్వేయర్ గారు ఆఫీసుకు రాలేదని తెలిసింది. ఈలోగా మండల విలేకరులు అక్కడకు రావడం జరిగింది. ఆ యొక్క రైతు తన యొక్క బాధను విలేకరులకు తెలియజేశారు. గత 5 నెలల క్రితం తన భూమిని సర్వే చేసేందుకు దరఖాస్తు చేసుకోగా సర్వేయరూచలానా కట్టమని చెప్పగా చలానా కట్టి సర్వేర్ గారికిఇవ్వడం జరిగిందని తెలియజేశారు. చలానా ఇచ్చిన తర్వాత మీ యొక్క భూమి సర్వే చేయాలంటే నాకు పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలియజేశారు 10000 రూపాయల్లో 2000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరిగిందని మిగతా ఎనిమిది వేల రూపాయలు సర్వే చేసిన తర్వాత ఇస్తామని చెప్పినాము అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన గాని స్పందించట్లేదు ఈ విషయమై మండల తాసిల్దారు గారికి ఆర్డీవో గారికి జిల్లా కలెక్టర్ గారికి అతనిపై ఫిర్యాదు చేసిన గాని ఏమాత్రం లెక్కచేయక నా యొక్క ఫోన్ కాల్స్ కూడా స్పందించడం లేదు నేనే కాక ఎల్ గోవిందపురం గ్రామానికి చెందిన కొంతమంది రైతులుఎకరానికి 18000 చొప్పున తీసుకున్నాడని వారు నాకు చెప్పడం జరిగింది. ఇలా లంచం తీసుకొని అనేక ఇబ్బందులు.పెడుతున్న మండల సర్వేయర్ పై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న రైతులు