Site icon PRASHNA AYUDHAM

పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు

IMG 20240803 WA0046 1

*విద్యోదయ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 3*

విద్యోదయ విద్యాసంస్థలలో శనివారం బోనాల పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల పండుగ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ యేబూషి రామస్వామి హాజరై కరస్పాండెంట్ రామస్వామి మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులలో ఇమిడింపజేయాలని ఉద్దేశంతో వారిని స్వతగా కార్యక్రమంలో పాల్గొనే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు కృత నిశ్చయంతో విద్యార్థులను కార్యోన్ముఖులను చేశారని ఈ బోనాల పండుగను ఆషాడ మాసంలో ప్రారంభించి శ్రావణమాసం చివరి వరకు జరుపుకుంటారని తెలిపారు వర్షాలు బాగా కురవాలని పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని ప్రజలంతా ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా అమ్మవారిని గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండగ అని తెలియజేశారు వేడుకలకు విద్యార్థులు సంప్రదాయ దుస్తులలో వచ్చి అలరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ యేబూషి రామస్వామితో డైరెక్టర్ జ్యోతి డైరెక్టర్ ఆర్యన్ కౌశిక్ అకాడమిక్ డైరెక్టర్ మహాలక్ష్మి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version