మాతమ్మ, పోచమ్మ లకు బోనాలు
సిద్దిపేట ఆగస్టు 12 ప్రశ్న ఆయుధం :
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని మునిగడప గ్రామంలో శ్రావణమాసం బోనాల పండుగలు 14వ తేదీన బుధవారం రోజున మాతమ్మ, పోచమ్మ, గ్రామదేవతలకు శ్రావణమాసంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని గ్రామ పెద్దలు, పెద్ద మాతర్ తుప్ప నాగరాజు, తుప్ప నరసింహులు, తుప్ప రాజలింగం, మరాఠీ ఐలయ్య, మరాటి కృష్ణమూర్తి, మరాఠీ వెంకటస్వామి, కురాడపు నర్సింలు, రమేష్ లు తెలిపారు. బోనాలలో అందరూ పాల్గొని బోనాల పండుగలను విజయవంతం చేయాలని కోరారు. బుధవారం గ్రామదేవతలకు బోనాల ఊరేగింపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి అని తెలిపారు. గురువారం రోజున వనభోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ పండుగలను మాదిగ కులానికి చెందిన అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.