శ్రీ ఎర్రకంచమ్మ అమ్మవారి మొదటి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర

*శ్రీ ఎర్రకంచమ్మ అమ్మవారి మొదటి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర*

*ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన స్థానిక నాయకులు, భక్తులు*

*అమ్మవారి పాల జంగిడి మోసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్1( ప్రశ్నయుధం న్యూస్ ) దత్తమహేశ్వరరావు

పార్వతీపురం మున్సిపాలిటీలో గల జగన్నాధపురం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ ఎర్ర కంచమ్మ అమ్మవారు మొదటి పూజలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం జగన్నాధపురం పురవీధుల్లో అమ్మవారి ఘఠాలు, పాల జంగిడి అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే అమ్మవారి పాల జంగిడి మోసుకెళ్లి ఆలయం వద్ద సమర్పించారు. పూజలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి జాతరను ఎటువంటి గొడవలు జరగకుండా అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన సూచించారు. ఆలయం వద్ద తోపులాట జరగకుండా కట్టు దిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు నిర్వహించిన కోలాటం లో ఆయన పాల్గొని ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచారు.

Join WhatsApp

Join Now