బొమ్మరిల్లు హోమ్స్ అపార్ట్మెంట్లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు..

*బొమ్మరిల్లు హోమ్స్ అపార్ట్మెంట్లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు..*

*ప్రశ్న ఆయుధం,జులై 21 శేరిలింగంపల్లి,ప్రతినిధి*

అమీన్ పూర్ లో బొమ్మ రిల్లు హోమ్స్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఓబుల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ హరీష్, కోశాధికారి హేమంత్, బొమ్మరిల్లు బిల్డర్ మహందర్, ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో ఘనంగా విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు స్థానిక నివాసితులు సమగ్ర సహకారం, సంఘీభావంతో సాగింది.ఈ వేడుకలో పలు ముఖ్యమైన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహిళల కట్టుబాటు బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఏర్పాటు చేసిన సామూహిక భోజన కార్యక్రమంలో అన్ని వయసుల వారు పాల్గొన్నారు. బాలల మరియు మహిళల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి.ఈ కార్యక్రమం కు కుటుంబ సభ్యులందరూ కలసి ఈ పండుగను ఒక ఇంటి వేడుకలా జరుపుకున్నారు.ఈ ఉత్సవానికి తమ విశేష సమయాన్ని కేటాయించిన ప్రతి కుటుంబానికి, సంఘ సభ్యులకు.బొమ్మరిల్లు హోమ్స్ ఉత్సవ కమిటీ బొమ్మరిల్లు హోమ్స్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఓబుల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ హరీష్, కోశాధికారి హేమంత్, బొమ్మరిల్లు బిల్డర్ మహేందర్ లు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment