మెదక్, ఫిబ్రవరి 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లిలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాల ఊరేగింపు ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపు చేపట్టారు. ఈ ఉత్సవాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్ట్ ఆవుల రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, సంఘం మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్ లు ప్రత్యేక పూజలు చేశారు. బోనాల పండుగ సందర్భంగా పోతరాజులు, శివసత్తుల ఆటపాటలు మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు రాజా గౌడ్, గౌడ సంఘం సభ్యులు దయాకర్ గౌడ్, వెంకాగౌడ్, సురేష్ గౌడ్, యాదాగౌడ్, మహేష్ గౌడ్, పెంటాగౌడ్, మాజీ సర్పంచులు యాదయ్, యాదాగౌడ్, గడ్డమీద నర్సింలు, మాజీ ఎంపీటీసీ సిద్ధ రాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.