సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు జి.అంజయ్య, కార్యదర్శి వసుంధర ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శనతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు అంజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పూర్వం నుండి నేటి వరకు గ్రంథాలయాలు అందించే జ్ఞానం, పుస్తకాల ప్రాముఖ్యత, పఠన ఆసక్తి పెంపుదల, ఒక మంచి పుస్తకం మన జీవన విధానంలో కలిగించే ప్రభావం వంటి అంశాలను స్పష్టంగా వివరించారు. ప్రదర్శనలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీ భాషలతో పాటు దాతలు అందించిన పోటీ పరీక్షల పుస్తకాలు, సాహిత్యం, ఆయుర్వేదం, న్యాయ సంబంధిత పుస్తకాలు ఏర్పాటు చేశారు. వీటిని గ్రంథాలయ అధ్యక్షుడు, పాఠకులు, సాహితీ మూర్తులు, పాఠశాల విద్యార్థులు సందర్శించి ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది శ్రీనివాస్, ప్రశాంత్, శోబారాణి, వరలక్ష్మీ, సావిత్రి, కృష్ణమూర్తి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన
Published On: November 15, 2025 6:11 pm