అంబేద్కర్ భవన్ కు బోర్ మోటార్ అందజేత

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): జామయమ్మ జగ్గారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణం అంబేద్కర్ భవన్ కు బోర్ మోటారును తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి తోపాజి అనంత కిషన్ అందజేశారు. ఈ సందర్బంగా తోపాజి అనంతకిషన్ మాట్లాడుతూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలో దసరా వేడుకల నిర్వహణ కోసం అంబేద్కర్ భవన్ ను అద్దెకు తీసుకున్నామని, అంబేద్కర్ భవన్ లో గత ఎండ కాలం నుండి బోర్ మోటార్ పని చేయకపోవడం వల్ల నీళ్ల రావడం లేదని అన్నారు. గంగేరి శ్రీహరి ద్వారా విషయం తెలుసుకున్న తోపాజి అనంత్ కిషన్ జగ్గారెడ్డితో మాట్లాడి జామయమ్మ జగ్గారెడ్డి ట్రస్ట్ తరపున బోర్ మోటార్ ను అంబేద్కర్ భవన్ ఇంచార్జ్ గోపాల్, రవిలకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, కాషాపగా ఇమ్మయ్య, బంగారు కృష్ణ, ఏల్. వేణు గోపాల్, ఏరోళ్ల పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now