జహీరాబాద్ ఎంపీని కలిసిన బోర్లం మాజీ ఎంపీటీసీ

జహీరాబాద్ ఎంపీని కలిసిన బోర్లం మాజీ ఎంపీటీసీ

ప్రశ్న ఆయుధం 07 నవంబర్ ( బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రావణి దేవేందర్ రెడ్డి తో కలిసి గురువారం బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది.గౌరవ ఎంపీ బొర్లం గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పట్లోళ్లశ్రావణి దేవేందర్ రెడ్డి యొక్క కుమారుడు మాస్టర్ నిశాంత్ రెడ్డి (ఎన్ఐఎంహెచ్ )లో సిఎస్సి కోర్సులో ప్రధమ స్థానం పొందినందుకు ఆ సంస్థ ఎన్ఐఎంహెచ్ వారు లాప్టాప్ ని మొదటి బహుమతిగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ విద్యారంగంలో నిశాంత్ రెడ్డి అత్యుత్తమ ప్రతిభ సాధించినందుకు ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది. గ్రామ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బోర్లం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తానని అంబేద్కర్ సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తో పాటు అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ కమ్మరి నర్సింలు సెక్రటరీ ఎర్రోళ్ల సాయిలు వైస్ ప్రెసిడెంట్ పోతరాజు లింగం కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పట్లోళ్ల దేవేందర్ రెడ్డి గుజ్జరి గంగారం దొంతుల గంగారం సొసైటీ మాజీ డైరెక్టర్ గడ్డి సాయిలు,మన్నే విజయ్ కుమార్,మన్నే గంగారం ఎర్రోళ్ల సాయిలు,బేగరి సాయిలు నల్లోల సాయికుమార్, మాజీద్ మాజీ కమిటీ ప్రెసిడెంట్ దడిగేహైమద్,మాజీ సెక్రెటరీ సయ్యద్ మంజూరు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment