నిజాంసాగర్ ప్రాజెక్టు అందాలను తిలకించిన బోర్లం మాజీ ఎంపీటీసీ

నిజాంసాగర్ ప్రాజెక్టు అందాలను తిలకించిన బోర్లం మాజీ ఎంపీటీసీ

ప్రశ్న ఆయుధం 30 ఆగస్ట్ ( బాన్సువాడ ప్రతినిధి )

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని అయినా నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద పోటెత్తడంతో అధికారులు 28 గేట్లు ఎత్తి ప్రాజెక్టు దిగువన లక్ష క్యూసెక్కుల నీటిని వదిలారు.వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు స్థానికులు తరలి వస్తున్నారు.ఈ నేపథ్యంలో బాన్సువాడ మండలం బోర్లం మాజీ ఎంపీటీసీ శ్రావణి దేవేందర్ రెడ్డిలు తన కుటుంబ సమేతంగా ప్రాజెక్టు అందాలను తిలకించడానికి వెళ్లారు.పొంగిపొర్లుతున్న వరద నీటి అలలను చూసి ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… నిజాం ప్రభువు నిర్మించిన చారిత్రాత్మక కట్టడమైన ప్రాజెక్టును చూసి ఆమె తిలకించారు.నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో దిగువన లక్ష ఎకరాల ఆయకట్టు రైతులకు ప్రాజెక్టు ద్వారా పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందని ఆమె తెలిపారు. ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడితో కిటకిటలాడుతోందని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సంతరించుకుందని ఆమె తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment