Site icon PRASHNA AYUDHAM

పందెం కాసి… ఐదు ఫుల్ బాటిల్లు తాగేశాడు….  ప్రాణాలు వదిలేశాడు…

IMG 20250502 WA1883

*పందెం కాసి… ఐదు ఫుల్ బాటిల్లు తాగేశాడు….*

ప్రాణాలు వదిలేశాడు…

నలుగురు స్నేహితుల మధ్య సరదాగా మొదలైన పోటీ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల కార్తీక్ అనే యువకుడు ఫ్రెండ్స్‌తో కలిసి రూ.10వేలకు పందెం వేసుకొని..ఐదు సీసాల మద్యంతాగి ప్రాణాలు కోల్పోయాడు.పోలీసుల వివరాల ప్రకారం..కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలోకు చెందిన కార్తిక్ అనే యువకుడికి గత ఏడాది వివాహం జరిగింది. అతని భార్య ఈ మధ్యే ఓ బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. అయితే కార్తిక్, అతని మరో ముగ్గురి ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకునేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఇక నలుగురు ఫ్రెండ్స్‌ పార్టీలో కూర్చుంటే మామూలుగా ఉంటుందా.. ఒకరిపై ఒకరు జోక్స్‌ వేస్తూ, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, ఎంతో సరదాగా ఏంజాయ్‌ చేస్తూ గడుపుతారు. కొన్ని సార్లు తినడం, తాగడం విషయంలో బెట్టింగ్స్‌ కూడా వేసుకుంటారు. ఇలాగే కార్తీక్, అతని ఫ్రెండ్స్‌ వెంకట రెడ్డి, సుబ్రమణి, మరో ముగ్గురి కలిసి పార్టీ చేసుకుంటుండగా ఓ పందెం పెట్టుకున్నారు. కార్తిక్‌ తాను ఐదు ఫుల్‌ బాటిల్స్‌ మద్యం తాగుతానని..ఫ్రెండ్స్‌తో అన్నట్టు తెలుస్తోంది. అలా తాగితే రూ.10,000 ఇస్తానని ఓ స్నేహితుడు కార్తీక్‌తో పందెం వేసుకున్నట్టు సమాచారం. దీంతో పెట్టుకున్న పందెం ప్రకారం.. కార్తీక్ ఐదు ఫుల్ బాటిల్స్ తాగినట్టు తెలుస్తోంది. అయితే అంతా బాగానే ఉంది అనుకున్నారు. కానీ మద్యం తాగిన కొద్దిసేపటికి కార్తిక్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

దీంతో స్నేహితులు కార్తిన్‌ను వెంటనే కోలార్ జిల్లాలోని ముల్బాగల్‌లోని ఆసుపత్రికి తరలించారు. కార్తిక్‌ను పరీక్షించిన వైద్యులు అతనికి చికిత్స అందించారు. కాగా పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌లో పొందుతూ అతను మరణించాడు. దీంతో కార్తిక్ కుటుంబ సభ్యుల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కార్తిక్‌ స్నేహితులు వెంకట రెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వారి స్నేహితుల్లో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం.

Exit mobile version