బాంబే క్లాత్ షోరూం ప్రారంభోత్సవానికి బ్రహ్మానందం

బాంబే క్లాత్ షోరూం ప్రారంభం.. 

 

-సెల్ఫీలతో మునిగిపోయిన అభిమానులు..

 

కామారెడ్డి టౌన్ 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 23:

 

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో హస్యనటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మించిన బాంబే క్లాత్ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా బాంబే క్లాత్ హౌస్ లో బ్రహ్మానందం ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బ్రహ్మానందం అభిమానులు భారీగా బాంబే క్లాత్ కు తరలివచ్చి ఆయనను తిలకించారు. అలాగే అభిమానులు బ్రహ్మానందంతో సెల్ఫీ ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. సుమారు 15 నిమిషాల పాటు బ్రహ్మానందం బాంబే క్లాత్ హౌస్ లో సందడి చేసి వెళ్లిపోయారు. ప్రారంభోత్సవంలో షో రూమ్ యజమానులు వీటిలాల్ వీటి రాజ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now