*బూర్గంపాడు అశ్వాపురం పినపాక కరకగూడెం మణుగూరు మండలంలో బెల్ట్ షాపుల పర్వం…*
*బ్రాండ్ లు వైన్ షాపులో దొరకవు… బెల్ట్ షాప్ కి వెళ్లాల్సిందే…?*
*ఆర్టిఐ ద్వారా బెల్ట్ షాపులు సిండికేట్ సమాచారం అడిగితే బెల్ట్ షాపులకు సిండికేటుకు ఎటువంటి పర్మిషన్ లేవని సమాధానం…!*
*బెల్ట్ మాఫియా కి ఆబ్కారి శాఖ అధికారుల సపోర్ట్*
*బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలి సామాజిక సేవకులు కర్నే బాబురావు పోరాటం*
పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మద్యం మాఫియా. మండలంలో మూడు షాపులకు అబ్కారీ శాఖ అనుమతివ్వగా ముగ్గురు మద్యం షాపు యజమానులు సిండికేట్ గా మారి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ ఊరూరా మినీ వైన్ షాపులను ఓపెన్ చేశారు. ఎనీ టైం ముందు లభించే విధంగా ఏర్పాట్లు చేసేసుకున్నారు. మద్యంషాపులకు ఒక రేటు.. బెల్టాపులకు ఒక రేటు ఫిక్స్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. బెల్ట్ షాపులు నడపాలంటే ముందుగా వైన్ షాపులతో ఒప్పందం కుదర్చుకున్నాకే వ్యాపారం సాగించాలి లేదంటే అధికారులతో తనిఖీలు చేయిస్తానంటూ ఓ బినామీ వ్యాపారి మద్యం వ్యాపారంలో సిండి “కేటు” మాయాజాలంలో సాకేతపురి మార్క్ చూపిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. మన వ్యాపారానికి సహకరించుకుంటే మీ మీ బెల్ట్ సంగతి అంతే అంటూ బెల్ట్ షాపుల నిర్వాహకులకు యజమాని హిత బోధ చేస్తున్నట్లు పలువురు గొలుసు కట్టు దుకాణదారులు మీడియా ముఖంగా ఆవేదన వెల్లడించారు. కాగా ఆయన కను సన్నల్లోనే మధ్యం సిండికేట్ దందా సాగుతుండగా అడ్డుకోవాల్సిన అధికారులు సైతం జి హుజూర్ అంటూ ఆయనకి వత్తాసు పలుకుతూ తనిఖీలు మరసి ఆ సిండికేట్ సాకేతపురి ఇచ్చే నెలవారి మామూళ్లకే అలవాటు పడి ఆయన కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నట్లుగా స్పష్టం అర్ధం అవుతోంది. మండలంలో సాగుతున్న మద్యం సిండికేట్ వ్యాపారంపై పలు పత్రికలు వరుసగా కథనాలు ప్రచురించడమే కాకుండా అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా ఇప్పటి వరకు షాపుల వైపు కన్నెత్తి చూడటం లేదంటే విధుల్లో వారి వైఖరి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది.
*ఒప్పందం ఓపెన్ సీక్రెట్ :*
మద్యం వ్యాపారులకు అబ్యారీ అధికారులకు అండర్ స్టాండింగ్ కుదిరిందనే ప్రచారంతో పాటు మండలంలో మద్యం వ్యాపారులకు బెల్ట్ షాపుల నిర్వహాకులకు లెక్క కుదిరిందని సమాచారం. మద్యం వ్యాపారం ఎలా చేసినా అడిగేందుకు అధికారులు అడ్డురారని నేను చూసు కుంటానని మద్యం డాన్ అశ్వాపురం “పెద్దన్న” అభయం ఇస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం . తమకు అడ్డు లేనప్పుడు ఎవరేం చేస్తే ఏంటీ అనే విచ్చల విడితనంతో మండలలో మద్యం సిండికేట్ రెచ్చిపోతోంది.
*మద్యం కల్తీ కూడా జరుగుతోందా…?*
మండలంలో మద్యం కల్తీ కూడా జరుగుతోందని కొంత మంది మందు బాబులు ఆరో పిస్తున్నారు. ఎక్కువ ధరలు కలిగిన మద్యం సీసాల్లో నీళ్లతోపాటు చీప్ లిక్కర్ మందును నింపుతూ కల్తీ దందా చేస్తున్నారంటూ పేర్కొంటుండటం గమనార్హం. లిక్కర్ కంపెనీల నుంచి నాణ్యతతో వస్తున్న బాటిళ్లు, అధిక ధరలు కలిగిన మద్యం సీసాలను కల్తీ చేస్తున్నారంటూ చెబుతుండటం గమనార్హం. ఈ సీసాల మూతలను ఒడుపుతో తొలగించి అందులో నుంచి కొంత మద్యాన్ని పక్కనబెట్టి ఆ స్థానంలో తక్కువ ధర ఉన్న చీప్ లిక్కర్ ను మిక్స్ చేస్తున్నారంటూ చెబుతున్నారు. వాసన రాకుండా స్పిరిట్ కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
*బెల్ట్ షాపులపై ఆబ్కారి శాఖ మౌనామేలా ..?*
ఆబ్కారి శాఖ కేవలం గుడుంబా పై మాత్రమే దాడులు నిర్వహిస్తారా? పట్టణాలు, పల్లెల నడి బోడ్డులో ఉండి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిటే బెల్ట్ షాపులు మాత్రం కనబడావా? అని
పలు ప్రజాసంఘాల నాయకులలు ముక్తకండంతో ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మణుగూరు ఆబ్కారి శాఖ అధికారులు నిద్ర బత్తు వదిలి బెల్ట్ షాపులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.అశ్వాపురం మద్యం బెల్ట్ షాపులపై ఎన్నో పత్రికల్లో సైతం వార్తలు వచ్చిన మణుగూరు ఆబ్కారి శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పై సిండికేట్ కి ప్రత్యక్షంగానే ఆబ్కారి శాఖ అధికారులు మద్దతు తెలుపుతున్నారని పలు అనుమానాలు సైతం ప్రజల్లో నెలకొన్నాయి. ఇప్పటికైనా ఆబ్కారి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.