Site icon PRASHNA AYUDHAM

అమరావతిలో భూసేకరణకు బ్రేక్ ?

IMG 20250712 WA0584

అమరావతిలో భూసేకరణకు బ్రేక్ ? పవన్ గరంగరం..! జగన్ కు ఛాన్స్ ఇవ్వొద్దనే..!

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా రెండో విడత భూసమీకరణ చేపట్టిన ప్రభుత్వానికి వరుస షాకులు తగులుతున్నాయి. గతంలో సేకరించిన 36 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా మళ్లీ రెండో విడత భూసమీకరణ పేరుతో జనాల్లోకి వెళ్తున్న అధికార పార్టీ నేతలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 

దీంతో ఏకంగా తాజాగా జరిగిన కేబినెట్ భేటీలోనే మంత్రులు ఈ భూసేకరణ వద్దంటూ సీఎం చంద్రబాబుకు తేల్చిచెప్పేశారు.

 

రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం రెండో విడతలో దాదాపు 40 వేల ఎకరాలకు పైగా భూమిని అమరావతి గ్రామాల్లో సమీకరించేందుకు సిద్దమైంది. అయితే అభ్యంతరాల నేపథ్యంలో ఈ 40 వేల ఎకరాలు కాస్తా 30 వేలు, 25 వేలకు తగ్గిపోతోంది. అయితే ఇప్పుడు మొత్తంగా భూసమీకరణే వద్దంటూ రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా భూములిచ్చిన రైతులు తమకు న్యాయం చేసి రెండో విడతకు వెళ్లాలని కోరుతుండగా.. రెండో విడత భూములిచ్చిన వారు సైతం అప్పట్లో భూములిచ్చిన వారికే న్యాయం చేయలేదు, మాకెప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

 

*అమరావతి నిధుల్లో వెయ్యి కోట్ల మళ్లింపు ? ప్రభుత్వం క్లారిటీ ఇదే..!*

 

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ భేటీలోనూ ఈ ప్రభావం కనిపించింది. కేబినెట్ భేటీలో అమరావతిపై వాడీవేడీ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పదేళ్లు పనులేవీ జరగకపోవడంతో ల్యాండ్ పూలింగ్ పై అమరావతిలో ఆందోళన వ్యక్తమవుతోందని మంత్రులు సీఎంకు తెలిపారు. సీఎం చంద్రబాబు, నారాయణ మినహా మంత్రులు ఈ భూసమీకరణకు అభ్యంతరాలు చెప్పినట్లు సమాచారం. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడుతున్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.

 

మరోవైపు అమరావతిలో తాజా ల్యాండ్ పూలింగ్ పై పవన్ కళ్యాణ్ సహా జనసేన మంత్రులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

ఇది వైసీపీ అధినేత జగన్ కు అవకాశం ఇవ్వడమే అని పవన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నే ఎదుర్కున్నాం, వైసీపీ ఎంత అని చంద్రబాబు ఆయన్ను వారించే ప్రయత్నం చేశారు. మీరు చాలా మాట్లాడతారు, జగన్ ను ఎదుర్కోవడానికి ఏం చేశారంటూ కౌంటర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

 

మరోవైపు అమరావతి పనుల్ని చూసి రమ్మని చెప్పానుగా.. ఎంతమంది వెళ్లారంటూ లోకేష్ ను చూసి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అమరావతి విషయంలో నారాయణ బ్యూరోక్రాట్ లా వ్యవహరిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆక్షేపించారని సమాచారం. ఫైనల్ గా రెండో విడత పూలింగ్ చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబుకు మెజార్టీ మంత్రులు చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో పూలింగ్ విరమించుకోవాలని వారు సీఎంకు సూచించారు. దీనిపై చంద్రబాబు ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోకున్నా త్వరలో కీలక ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది.

Exit mobile version