*ఆంధ్రా ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంకు*
విజయవాడ :
ఏపీలో నవజాత శిశువుల కోసం తల్లిపాల బ్యాంకు ఏర్పాటు చేయటం అభినందనీయమని నమ్రతా మహేష్ బాబు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, ఆంధ్రా ఆసుపత్రి సంయుక్తంగా రూ.37.24 లక్షల వ్యయంతో.. ఆంధ్రా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన తల్లిపాల బ్యాంకును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు.