తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

● ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సంతోష

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 2(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని అంగన్వాడి ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సంతోష అన్నారు. శివ్వంపేట అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టించాలని తెలిపారు. ముర్రుపాల విషయంలో అపోహలను తొలగించాలని, బిడ్డకు జీవితాంతం ముర్రుపాలు మొదటి టీకా అని తెలియపరిచారు. తల్లిపాలు ఇవ్వడంలో తల్లికి లాభాలు, బిడ్డకు ప్రయోజనాలు గురించి వివరించారు.

Join WhatsApp

Join Now