Jul 22, 2025,
రూ. 5. 50 పైసలకు ఇటుక సరఫరా: పెద్దపల్లి కలెక్టర్
పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకలను ఒక్కో ఇటుక రూ. 5. 50 పైసలకు సరఫరా చేసేందుకు బట్టీల యాజమానులు నిర్ణయించారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం తెలిపారు. ఇటుక బట్టీల యాజమానులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి జిల్లాలోని 102 ఇటుక బట్టీల నుంచి తక్కువ ధరకు ఇటుక సరఫరా చేయాలని ఒప్పించామని తెలిపారు.