మెరిసిన శశాంక్ డిగ్రీ కళాశాల విద్యార్థులు..

మెరిసిన శశాంక్ డిగ్రీ కళాశాల విద్యార్థులు..

IMG 20240928 WA0095 1

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు కళాభారతి ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శశాంక్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి బహుమతులను గెలుచుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్ ఏ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గెలుపొందిన వారిలో హ్యాండ్ క్రాఫ్ట్ విభాగంలో అలియా ఇఫ్ఫాత్ మొదటి బహుమతి, అతుఫా తన్జీమ్ రెండవ బహుమతి సాధించగా, వ్యాసరచన పోటీ విభాగంలో హబీబా ఉన్నిసా రెండవ బహుమతి సాధించగా, టెక్స్ట్ టైటిల్ విభాగంలో ఆయేషా సిద్దికా మొదటి బహుమతి సాధించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ., ప్రతి విద్యార్థి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొంటూ మీలో ఉన్నా ప్రతిభ జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో కనబర్చి ఇలాంటి బహుమతులు మరెన్నో గెలుపొంది కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు..

Join WhatsApp

Join Now