పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం తీసుకురండి: రెవెన్యూ అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశాలు
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, ప్రశ్న ఆయుధం ఆగస్టు 7
‘భూభారతి’ మరియు రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీసర మరియు ఘట్‌కేసర్ మండలాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులపై ఆయన సమీక్ష నిర్వహించారు.
జాప్యంపై క్షుణ్ణంగా విచారణ:
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యానికి గల కారణాలను అదనపు కలెక్టర్ క్షుణ్ణంగా విశ్లేషించారు. సంబంధిత అధికారుల నుంచి వివరాలు తీసుకుని, అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.
సాంకేతిక సమస్యలపై ప్రత్యేక దృష్టి:
భూభారతి వ్యవస్థలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల వ్యవహారంలో జాప్యం జరుగకుండా చూడాలని సూచించారు.
ఆన్‌లైన్ మరియు మాన్యువల్ దరఖాస్తుల సమీక్ష:
ఆన్‌లైన్ మరియు మాన్యువల్ దరఖాస్తులపై తీసుకున్న చర్యలను సమీక్షించి, వాటిని వేగంగా పూర్తిచేయాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడమే అధికారుల బాధ్యత అని గుర్తు చేశారు.