కృష్ణాష్టమి నాడు ఇవి మీ ఇంటికి తెస్తే అదృష్టం..

కృష్ణాష్టమి నాడు ఇంటికి ఈ వస్తువులు తెచ్చుకుంటే సంపదల వర్షం!!

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 26వ తేదీన నేడు కృష్ణాష్టమి పర్వదినాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. శ్రీకృష్ణుడి బాల రూపాన్ని కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరం పూజిస్తాం.శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన అత్యంత భక్తి భావంతో ప్రతి ఇంటా వేడుకలు జరుపుకుంటారు. శ్రావణమాసంలోని కృష్ణపక్ష అష్టమి నాడు జరుపుకునే శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ప్రత్యేకం.శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు కృష్ణుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని కృష్ణుని కటాక్షం మనపై ఉంటుందని చెబుతారు. కృష్ణాష్టమి పర్వదినాన ఇంటికి కొన్ని వస్తువులను తీసుకొచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు. కృష్ణాష్టమి నాడు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన ఎవరైతే పిల్లనగ్రోవిని ఇంటికి తెచ్చుకుంటారో వారికి కృష్ణుడి కరుణాకటాక్షాలు ఉంటాయని చెబుతారు. శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం. కాబట్టి వేణువును ఇంటికి తెచ్చుకోవాలి. కృష్ణుడికి ఆవులు అంటే చాలా ఇష్టం, కాబట్టి కృష్ణాష్టమి రోజున ఆవులకు ఆహారం తినిపించాలి. ఆవుల బొమ్మలను ఇంటికి తెచ్చుకోవాలి. వీటితో అదృష్టం కలిసి వస్తుంది.కృష్ణాష్టమి పర్వదినాన శ్రీకృష్ణుని బాలరూపాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఆ కృష్ణ పరమాత్మ కరుణాకటాక్షం తప్పకుండా ఉంటుంది. శ్రీకృష్ణుడికి కిరీటం పైన నెమలీకలు ఉంటాయి. కృష్ణాష్టమి పర్వదినాన నెమలీకలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. నెమలీకలను ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి సంతోషం వెలి విరుస్తుంది.ఆర్ధిక సంక్షోభం పోవాలంటే కృష్ణాష్టమి నాడు ఇవి తెచ్చుకోండి.శ్రీకృష్ణ జయంతి నాడు వైజయంతి మాలను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లోనే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. కృష్ణాష్టమి పండుగ నాడు కృష్ణుడికి ఇష్టమైన వెన్నను ఇంటికి తెచ్చుకోవాలి. కృష్ణుడికి వెన్నను, పాలను సమర్పించి పూజించాలి. అప్పుడే గోపాలుడు మన కోరికలను తీరుస్తాడు.ఈ వస్తువులు తెచ్చుకుంటే మీ ఇంట సంపదల వర్షం.. అంతే కాదు కృష్ణాష్టమి నాడు ఆవు, లేగ దూడ విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య మూలలో పెట్టి పూజిస్తే శ్రీకృష్ణుడి కటాక్షం ఆ కుటుంబ సభ్యుల పైన తప్పకుండా ఉంటుంది. కనుక కృష్ణ పరమాత్మకు ఇష్టమైన ఈ ఆరు వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి అప్పుడు కృష్ణుడు మీ ఇంట సంపదల వర్షం కురిపిస్తాడు.

Join WhatsApp

Join Now