అన్నను చంపిన కేసులో తమ్ముడు అరెస్టు

మెదక్, జిల్లా శివ్వంపేట జనవరి 18 ప్రశ్న ఆయుధం న్యూస్:మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నాను తండాలో శనివారం వెలుగులోకి వచ్చిన అన్నను చంపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండాకు చెందిన శంకర్ అతని సోదరుడు గోపాల్ హత్య చేసినట్లు తూప్రాన్ సీఐ కృష్ణ తెలిపారు. వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న గోపాల్ పథకం ప్రకారం శంకర్ హత్య చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గోపాల్ను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now