ప్రాథమిక పాఠశాలకు తీసుకొచ్చి తాగి డ్యాన్సులు..

IMG 20240927 WA0113

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన పాఠశాలను కొందరు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చుకున్నారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ, బార్‌ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకర నృత్యాలతో వేడుకలు చేసుకున్నారు. బిహార్‌లోని సహర్సా జిల్లా జలాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.పెళ్లి వేడుకల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బ్యాండు, నలుగురు బార్‌ డ్యాన్సర్లను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తీసుకొచ్చి తాగి డ్యాన్సులు చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇలాంటి వేడుకలకు విద్యాశాఖ ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. పెళ్లి బరాత్‌లో భాగంగా కొందరు వ్యక్తులు పాఠశాలలో బస చేసి వినోదం కోసం ఇలా చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై స్థానిక పోలీస్‌ స్టేషన్ ఇన్‌ఛార్జి మమతా కుమారి స్పందించారు. ఇలాంటి ఏ కార్యక్రమానికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ వైరల్‌ వీడియో తమ దృష్టికి రాగా.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Join WhatsApp

Join Now