బి అర్ ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు

ఆధ్వర్యంలో
Headlines:
  1. “బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపు విరమణ”
  2. “హుజరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిలబడింది”
  3. “తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతే బీఆర్ఎస్ అండగా నిలుస్తుంది”
  4. “బీఆర్ఎస్ విజయాన్ని జరుపుకునే కార్యక్రమం”

*ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు విరమణ తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు*

హుజురాబాద్ అక్టోబర్ 29 ప్రశ్న ఆయుధం:-*

విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిలబడి పోరాడి చార్జీలు పెంచకుండా నిలువరించినందుకు హుజరాబాద్ నియోజకవర్గం లోని రైతులతో పాటు ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు చేసుకున్నారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పేరిట 18,500 కోట్లు తెలంగాణ ప్రజలు, రైతులపై భారం వేయాలని చూసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతే బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుందని ఇది తెలంగాణ పార్టీ విజయం కాదని తెలంగాణ ప్రజల విజయమని అన్నారు. అనంతరం ఒకరికొకరు సీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు సింగిల్ విండో చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ అపరాద ముత్యం రాజు ముక్క రమేష్ కేసిరెడ్డి లావణ్య సుశీల నాయకులు ఇమ్రాన్ మైకేల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now