విద్యను భ్రష్టు పట్టించిన బిఆర్ఎస్ ప్రభుత్వం

*విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి బిఆర్ఎస్ ప్రభుత్వం*

* కాంగ్రెస్ ప్రభుత్వంపైనే విమర్శలా..?*

*విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కారు*

*ఉపాధ్యాయులను అవమానించిందే బీఆర్ఎస్*

*అవగాహన రాహిత్యంతోనే సీఎంపై ఆరోపణలు*

*ముఖ్యమంత్రి ప్రైవేటు టీచర్లను అవమానించినట్లు మాట్లాడలేదు*

*క్వాలిఫైడ్ టీచర్లు ఉండాలనే అభిప్రాయం చెప్పారు*

*నిరుద్యోగం పెరగాలని ఈ కారణం బిఆర్ఎస్ ప్రభుత్వం*

*రాష్ట్రంలో విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది..*

*బడ్జెట్లో రూ.21 వేల కోట్లు కేటాయింపు..*

*పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ టీచర్ల ప్రమోషన్లు ఎందుకు చేపట్టలేదు..?*

*ఒక్క డీఎస్సీని ప్రకటించలేకపోయారు..?

*మాజీ ఎంపీ వినోద్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఫైర్*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో ఆగస్టు 5*

తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుంటుందని ఉపాధ్యాయుల గౌరవం మరింత పెరుగుతుందని భావించామని ఇందుకు విరుద్ధంగా విద్యా వ్యవస్థను గత బిఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు గౌరవం పెరగడం ఏమో కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్రంగా అవమానించిందని మండిపడ్డారు
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం వెలిచాల రాజేందర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు
శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమోషన్లు పొందిన 30 వేల మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం బీఆర్ఎస్ కు నచ్చలేదని పేర్కొన్నారు
ఇందులో సీఎం రేవంత్ రెడ్డి
ప్రైవేటు ఉపాధ్యాయులను అవమానించినట్లు ఎక్కడ మాట్లాడలేదని ప్రభుత్వ పాఠశాలల్లో పీజీలు పీహెచ్డీలు చేసిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారని పేర్కొన్నారు. మంచి విద్యను అందిస్తున్నారని సీఎం చెప్పారని తెలిపారు ప్రైవేటు పాఠశాలల్లో కాలేజీల్లో క్వాలిఫైడ్ టీచర్లు లెక్చరర్లు ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు 50 శాతం మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని ప్రైవేట్ టీచర్లను ఏమాత్రం కించపరిచే వ్యాఖ్యనం చేయలేదని వారికి నాణ్యమైన విద్య అందాలనే ఆలోచనతో సీఎం మాట్లాడారని తెలిపారు విద్య విధానం పై అసలు బీఆర్ఎస్ వైఖరి ఏంటి ? పేదలకు మంచి విద్య అందించకూడదా అని ప్రశ్నించారు ఆత్మ విమర్శన చేసుకోవాలని వినోద్ కుమార్ సీఎం వాక్యాలను తప్పుగా అర్థం చేసుకున్నారని మండిపడ్డారు
విద్య హక్కు చట్టాన్ని బీఆర్ఎస్ సరిగా అమలు చేయలేక తుంగలో తొక్కిందని అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ చట్టం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవ చేశారు వారి హాయంలో విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే విద్యారంగం ఆనాడే బాగుపడదని సూచించారు 2009 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో విద్యాహక్కు చట్టాన్ని రూపొందించారని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఈ చట్టం గురించి మాట్లాడడం వింతగా ఉందని పేర్కొన్నారు
ఉద్యోగాలు లేకనే నిరుద్యోగులు ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు బోధిస్తున్నారని ఇందుకు బీఆర్ఎస్ పాలకులే కారణమని మండిపడ్డారు ఈ విషయాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ గమనించాలని సూచించారు నిరుద్యోగాన్ని పదండ్ల కాలంలో పెంచిందే బీఆర్ఎస్ అని ధ్వజమెత్తారు
పదేళ్ల కాలంలో ఒక్క జాబ్ ను భర్తీ చేయకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషించి విద్యారంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై తిరిగి విమర్శల చేయడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు
రాష్ట్రంలో ఉన్న 30 వేల సర్కారు బడుల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు పదివేల ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు గత సంవత్సరం కంటే ఈసారి రెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరకపోవడం గత బీఆర్ఎస్ సర్కారు అవలంబించిన విధానాలే కారణమని మండిపడ్డారు మళ్లీ డ్రాప్ అవుట్సు 2 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్లే తగ్గిందనడం అర్థం లేని విమర్శ అని పేర్కొన్నారు
మీ పాలనలో విద్యారంగంపై ప్రేమ ఉంటే ఒక్క డీఎస్సీని ఎందుకు నిర్వహించలేదు పదేళ్ల కాలంలో టీచర్ల ప్రమోషన్లు ఎందుకు చేపట్ట లేకపోయారు విద్యారంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారో మాజీ ఎంపీ వినోద్ కుమార్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర బడ్జెట్లో 21 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు అదేవిధంగా రాష్ట్రంలో 30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించిందని 35 వేల మంది టీచర్లను బదిలీలు చేసిందని తెలిపారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిందని గుర్తు చేశారు
మీరు 10 ఏళ్ల కాలంలో టీచర్ల బదిలీలు ప్రమోషన్లు చేపట్ట లేకపోవడం అసమర్థతే కారణమని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ హయాంలో కనీసం బడుల్లో ఉడ్చడానికి తుడ్చడానికి టీచర్లకు నీళ్లు ఇచ్చేందుకు కార్మికులను నియమించలేదని ఆడపిల్లలు మహిళా టీచర్లకు కనీసం టాయిలెట్ల వసతి కూడా కల్పించలేదని ఆరోపించారు తమ ప్రభుత్వం సర్కారు బడి అంటే తల్లిదండ్రుల్లో ఆత్మగౌరవం పెంచేలా వాటిని తీర్చిదిద్దుతున్నదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిపై లేనిపోని విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులను గమనించి మాట్లాడాలని హితవు పలికారు
విద్య హక్కు చట్టం 2009లో రూపొందించబడిందని 6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం ద్వారా భారతదేశ విద్యా విధానంలో ఒక మైలు రాయిని నెలకొల్పిందన్నారు 2009లో చట్టాన్ని తెరపైకి తెచ్చిన అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నదని ఇందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టిందని పేర్కొన్నారు. రైతులకు పేదలకు ఇస్తున్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు బడులకు ఉచిత కరెంటు సరఫరా చేస్తుందని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారని పేర్కొన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
పాఠశాలల్లో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 79 కోట్లు ఖర్చు చేసి కార్మికులను నియమిస్తున్నదని పాఠశాలల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ బాధ్యతను స్వశక్తి సంఘాలకు అప్పగించనుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం అనేక వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతున్నదని ఇన్ని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరి కాదన్నారు
ప్రైవేటు టీచర్ల వెల్ఫేర్ చట్టం రూపొందించేందుకు బీఆర్ఎస్ కేంద్రం ప్రభుత్వం మెడలు వంచి ఒత్తిడి తీసుకురావాలని వినోద్ కుమార్ కు వెలిచాల రాజేందర్ రావు సూచించారు. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు ప్రైవేట్ టీచర్ల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు ఇష్ట రాజ్యాంగ ప్రభుత్వంపై ఏది పడితే అది మాట్లాడితే బాగుండదని బీఆర్ఎస్ నాయకులకు వెలిచాల రాజేందర్ రావు సూచించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.

Join WhatsApp

Join Now