సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన బిఆర్ఎస్ నాయకులు
అడ్డుకున్న పోలీసులు
జమ్మికుంట ఇల్లందకుంట జూలై 26 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రం లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సరిగొమ్ముల పావని వెంకటేష్ ఆధ్వర్యంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీస్ లు అడ్డుకున్నారు అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై అక్రమంగా కేసులు పెడుతున్నారని విమర్శించారు.ఎన్ని కేసులు పెట్టి ,భయపెట్టిన ప్రజల కోసం కొట్టాడే వ్యక్తి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అని ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి, ఫోన్ టాపింగ్ అని ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులను గురిచేస్తున్నారని పేర్కొన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అంతకముందు సీఎం రేవంత్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.
కార్యక్రమం లో నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ పోలీనేని సత్యనారాయణరావు ధంసాని కుమార్,చిన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు.