ఎల్లమ్మబండ ఈద్గా లోఉరూస్ కార్యక్రమం లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు

ఎల్లమ్మబండ ఈద్గా లోఉరూస్ కార్యక్రమం లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు

ప్రశ్న ఆయుధం జనవరి 10: కూకట్‌పల్లి ప్రతినిధి

అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ ఉరూస్ జరుగుతున్న క్రమంలో భాగంగా 124 డివిజన్ ఎల్లమ్మబండ ఈద్గా లో ముస్లిం పెద్దలు మరియు రషీద్ భాయ్ ఆద్వర్యంలో ఖవాలీ (భజన) నిర్వహించి ఖాజా గరీబ్ నవాజ్ ని స్మరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి డివిజన్ BRS సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో సాయి గౌడ్, ఈద్గా సెక్రెటరీ మున్నా షౌకత్ అలీ, రసూల్, చిన్న మున్నా, మజాహార్,నవాజ్ భాయ్, అనిల్, బలస్వామి, కృష్ణ, రాజు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now